![]() |
![]() |

బుల్లితెర మీద స్టైలిష్ యాంకర్ గా శ్యామలకి ఎంతో పాపులారిటీ ఉంది. ఈ క్రేజ్ ద్వారానే ఆమె బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి నుంచి షోస్ ని, ఈవెంట్స్ ని హోస్ట్ చేస్తూ ఉంది శ్యామల. అవకాశం వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. శ్యామల యాంకర్ గా మంచి మార్క్స్ కొట్టేసింది కానీ యాక్టర్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ప్రతీది తన ఫాన్స్ తో, నెటిజన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తక్కువ కాకుండా గ్లామర్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. బొద్దుగా ఉన్న శ్యామల కాస్తా బక్కచిక్కి కనిపించింది.
ఇప్పుడు ఈమె పీచ్ కలర్ శారీలో ఉన్న ఒక ఫోటో షూట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈమె పిక్స్ చూసాక నెటిజన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. " లూజ్ హెయిర్ లో చాలా బాగున్నారు. పెళ్ళైనా మీ అందం మాత్రం తగ్గలేదు ఇంకా పెరుగుతూనే ఉంది..ఇంత హాట్ గా ఉంటే ఎలా మేడం" అని అంటున్నారు. శ్యామల సీరియల్ యాక్టర్ నరసింహని లవ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలుసు..నరసింహ కార్తీకదీపంలో, అలాగే వెబ్ సిరీస్ ఎక్సపోజ్డ్ లో నటిస్తున్నాడు..క్రిస్మస్ కి శాంటాలా మారిన శ్యామల..ఇప్పుడు కొత్త ఏడాదిలో అచ్చమైన తెలుగమ్మాయి గెటప్ లో కనిపిస్తూ మైమరిపిస్తోంది.
![]() |
![]() |